కల్వచర్లలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ
•_మట్టి విగ్రహాలు పర్యావరణ పరిరక్షణలో సర్వప్రాణి హితం- సింగరేణి జియంలు సుంకర మధుసూదన్, కొలిపాక నాగేశ్వరరావు_ పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సోమవారం వినాయక చవితి పండుగను పురస్కరించుకుని, భజన మండలి కన్వీనర్, విశ్రాంత సింగరేణి అధికారి నూక రమేష్ గారి ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలోని సాయి నిలయం వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీకి చెందిన తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ గారి వద్ద కొనుగోలు చేసిన మట్టి విగ్రహాలను భక్తులకు ఉచితంగా...