కుట్ర రాజకీయాలు మానండి.. ప్రజల సమస్యలు పరిష్కరించండి

మహాదేవపూర్: బీఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేయడం, కుట్ర రాజకీయాలకు పాల్పడటం మానుకుని ప్రజల సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్‌ నాయకులు దృష్టి సారించాలని బీఆర్‌ఎస్‌ మండల నాయకుడు మురుకుట్ల రాజు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌పై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. శ్రీధర్‌బాబు పుట్టకముందే మహాదేవపూర్‌లో జీసీసీ ఉందని, ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు గుర్తుంచుకోవాలని రాజు పేర్కొన్నారు. మహాదేవపూర్‌లో కొనసాగుతున్న గ్యాస్‌ ఏజెన్సీని భూపాలపల్లికి తరలించే ప్రయత్నాలపై కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గ్యాస్‌ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకుంటారా అని నిలదీశారు. ఆధారాలు లేకుండా మా నాయకుడిపై అసత్య ఆరోపణలు చేయడం ఎందుకని...