పెద్దంపల్లిలో టీఆర్పీలో భారీ చేరికలు
రేగొండ: రేగొండ మండలం పెద్దంపల్లి గ్రామం నుంచి పలువురు యువకులు సోమవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. 8వ వార్డు సభ్యుడు అంబటి కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల్లో అంబటి కార్తీక్‌తో పాటు ఎర్రబాటి హరీష్, వజ్జీరు కిరణ్, చలుకాని సైలని, బాబా, సిద్ధార్థ తదితరులు పార్టీలో చేరారు. వారికి టీఆర్పీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కులు, అభ్యున్నతి, రాజ్యాధికారం కోసం టీఆర్పీ చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పార్టీ విధానాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రజా సమస్యల...