అవగాహన లోపమా.. అతి ఉత్సాహమా..?
మహాదేవపూర్: కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలలోనే అసలు వాస్తవాలు దాగి ఉన్నాయని బీఆర్ఎస్ నాయకుడు బుర్రి రవి ఒక ప్రకటనలో విమర్శించారు.గతంలో రూ.1,030కే లభించే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఏకంగా రూ.1,100 పెట్టి కొనాల్సిన దుస్థితి ఎవరి వల్ల ఏర్పడిందో కాంగ్రెస్ నాయకులు వివరించాలని డిమాండ్ చేశారు.కొన్ని ప్రజా సంఘాల ద్వారానే గ్యాస్ ఏజెన్సీ తరలిపోయినట్టు స్వయంగా కాంగ్రెస్ నాయకులే ఒప్పుకోవడం, దానిని సమర్థిస్తూ ప్రకటనలు ఇవ్వడం కాంగ్రెస్ నాయకులకే సాధ్యమని ఎద్దేవా చేశారు.ప్రజలను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు? ప్రజలకు ఎవరు భారం మోపుతున్నారో, ఆ ప్రజా సంఘాలను అడ్డం పెట్టుకొని ఎవరు గ్యాస్ ఏజెన్సీని తరలించే కుట్రలు చేస్తున్నారో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.రూ.1,100...