కాటారం ప్రజల సమస్యలపై దుద్దిళ్లకు శ్రద్ధ ఏది?
కాటారం: కాటారం మండల ప్రజలు ప్రతి ఎన్నికల్లో మెజార్టీ ఇస్తున్నప్పటికీ వారి సమస్యల పరిష్కారంపై దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శ్రద్ధ చూపడం లేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు. ఓట్ల కోసం దుద్దిళ్ల శ్రీధర్ ఎన్నిటికైనా దిగజారుతారని ఆరోపించారు. సోమవారం ఒడిపిలవంచ ఊర చెరువు, జాదరావుపేట పెద్ద చెరువు, వీరాపూర్ శివశంకర్ ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడల్లా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ ఏడాదిలోపు పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన వారికి పరిహారం అందిస్తామని చెప్పినా ఇప్పటికీ పలువురికి...