బీఆర్ఎస్ పోరాట ఫలితమే.. మహాదేవపూర్‌కు తిరిగి గ్యాస్ ఏజెన్సీ
–పది రోజుల ప్రజల ఇబ్బందులకు పరిష్కారం –నిరసనతో స్పందించిన అధికారులు.. తిరిగి గోదాముకు గ్యాస్ నిల్వలు. –ప్రజల పక్షాన పోరాడి విజయం సాధించాం: బీఆర్ఎస్ శ్రేణులు. మహాదేవపూర్: మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీ తరలింపుతో పది రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ పార్టీ స్పందించింది. ప్రజల సమస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో బుధవారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడంతో అధికారులు స్పందించారు. దీంతో గ్యాస్ ఏజెన్సీని తిరిగి మహాదేవపూర్ మండల కేంద్రానికి తరలించారు.బుధవారం గ్యాస్‌ను మహాదేవపూర్‌లోని గోదాముకు తరలించి భద్రపరిచారు. దీంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మహాదేవపూర్ మండల కేంద్రంతో పాటు కాటారం సబ్‌డివిజన్‌లోని పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచే గ్యాస్...