ఎన్ఎస్యూఐ బలోపేతానికి కృషి చేయాలి
శ్రీధర్‌బాబు మార్గదర్శకత్వంలో పనిచేస్తూ భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్యూఐను మరింత బలోపేతం చేసి, విద్యార్థుల హక్కుల సాధనకు కృషి చేస్తానని భూపాలపల్లి జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు పురుషోత్తం అనూప్ తెలిపారుజయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా నియమితులైన పురుషోత్తం అనూప్ బుధవారం హైదరాబాద్‌లోని అసెంబ్లీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా నియమించినందుకు ఆయన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఎన్ఎస్యూఐతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహిస్తూ జిల్లా, మండల స్థాయిల్లో...