దానం నాగేందర్‌పై అనర్హత వేటు

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. పార్టీ ఫిరాయింపుల కేసులో అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టి, దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ప్రకటించింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పష్టం చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు విచారించింది. దానం నాగేందర్ అనర్హత 2024 ఏప్రిల్...