మానవ హక్కులపై అవగాహన సదస్సు

హన్మకొండ: హన్మకొండలో జాతీయ మానవ హక్కుల మండలి (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఎన్‌జీవో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాసేవ, సంస్థ భవిష్యత్తు కార్యాచరణ, సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా చర్చించారు. జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు ‘డెమొక్రటిక్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్’ నూతన సంస్థాగత వేదికను లాంఛనంగా ప్రారంభించారు.ఎన్‌జీవో గ్రూప్ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించనున్నట్లు జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఐలినేని శ్రీనివాస్ తెలిపారు. అనుభవజ్ఞులైన పాత సభ్యుల సేవానుభవాన్ని, కొత్త సభ్యుల శక్తి, సేవాభావాన్ని సమన్వయం చేయాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో న్యాయవాదులు, వైద్యులు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు,...