చెన్నూరు పట్టణ రెడ్డి సంఘం అధ్యక్షుడిగా తిరుపతి రెడ్డి
చెన్నూరు: తెలంగాణ రెడ్డి సంఘం చెన్నూరు పట్టణ నూతన కమిటీని మంచిర్యాల జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర నాయకుడు సంతోషం గోపాల్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. రెడ్డి సంఘం అభివృద్ధికి, సమాజ సేవకు నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు.పట్టణ అధ్యక్షుడిగా ముల్కల్ల తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మూల గోపాల్‌రెడ్డి, ఆర్థిక కార్యదర్శిగా చీర్ల సుదర్శన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రత్న సత్యనారాయణరెడ్డి, బొమ్మ మల్లారెడ్డి, ఆలూరి సత్యనారాయణరెడ్డి, తుమ్మల తిరుపతిరెడ్డి, సంస్థాగత కార్యదర్శులుగా రత్న లక్ష్మీనారాయణరెడ్డి, నాగుల సత్యనారాయణరెడ్డి, వంగల సదాశివరెడ్డి, తుమ్మల సుదర్శన్‌రెడ్డిలను ఎన్నుకున్నారు.సంయుక్త...