లెంకలగడ్డలో ఘనంగా కుంకుమ పూజ

లెంకలగడ్డ: శ్రీ వినాయక స్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామ క్షేమం కోసం ఆదివారం కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. పురోహితులు ముప్పిడోజు రాజేశ్వరాచార్యుల ఆధ్వర్యంలో లలితా అష్టోత్తర పూజ, అష్టలక్ష్మి అష్టోత్తర పూజతో పాటు కుంకుమార్చన నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. పూజా కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ గ్రామస్తులు, మహిళా మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.