హిందూ ధర్మంపై ఇంత నిర్లక్ష్యమా

హిందూ పండుగల పట్ల కాంగ్రెస్‌ నిర్లక్ష్యం: బీజేపీ ధ్వజం కరీంనగర్ సాక్ష్యం ప్రతినిధి సెప్టెంబర్ 21 కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గణేశ్ నిమజ్జనానికి ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్వయంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. నీటి విడుదల కోసం బీజేపీ ఆధ్వర్యంలో 'చలో చింతకుంట'...