సుందరశాలలో వినాయకుడి సన్నిధిలో ఘనంగా అన్నదానం

సుందరశాల గ్రామంలో వినాయకుని సన్నిధిలో నిన్న భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుండమంజుల రాంగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు