చేతకాని వాడు మీసాలు మెలేసినట్టు... కరెంటు ఇవ్వలేక, నిలదీస్తే అరెస్టులా?
మహాదేవపూర్ : కరెంటు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, ప్రశ్నించే గొంతును నొక్కుతోందని, ఇది ప్రజాస్వామ్య గొంతు నొక్కే చర్యేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన పవర్ ప్లాంట్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా, మహాదేవపూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.రైతులకు 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంటు ఇవ్వలేని ఈ ప్రభుత్వం, రైతులను అరిగోస పెడుతోందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిరంతర విద్యుత్ తో రైతు మొహంలో ఆనందం ఉండేదని, మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు ఈ కరెంటు కోతలు...