మూడేళ్లలో మొండిచేయి... నిందలు మాత్రం బీఆర్ఎస్ పైనా?
మహాదేవపూర్ : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కటకం అశోక్ గురువారం చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ మండల యువజన నాయకుడు బుర్రి రవి ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్ల పాలన కాలానికి చేరువవుతున్నా, మహాదేవపూర్ మండలంలో ఒక్క పని కూడా చేయని మంత్రి శ్రీధర్ బాబును కాపాడుకోవడానికే ఇలాంటి అర్థం లేని ప్రెస్ మీట్లు పెడుతున్నారని ధ్వజమెత్తారు.అగ్నిమాపక కేంద్రం ప్రారంభానికి "ఫైర్ ఇంజన్" షెడ్ పూర్తిగా క్యూరింగ్ కావాలని, చిన్న కాళేశ్వరం పనులు క్యూరింగ్ వల్లనే ఆలస్యమవుతున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.40 ఏండ్లు ఒకే కుటుంబం చేతిలో అధికారం ఉందని, కేవలం మంథని ఎమ్మెల్యేగా పుట్ట మధు పనిచేసింది 4.5...