గేదెను ఢీకొన్న బొగ్గు టిప్పర్

తాడిచర్ల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచర్ల సమీపంలో శనివారం బొగ్గు టిప్పర్ గేదెను ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. తాడిచర్ల ఏఎమ్మార్ ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు లోడుతో చెల్పూర్ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.ప్రమాదంతో గేదె యజమాని టిప్పర్‌ను నిలిపివేసి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మార్గంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.