కాంగ్రెస్ పార్టీలో చేరిన పెందుర్ జీవన్ మహారాజ్*

*కాంగ్రెస్ పార్టీలో చేరిన పెందుర్ జీవన్ మహారాజ్* *గుడిహత్నూర్, భారత వాసి సెప్టెంబర్ 26:* గుడిహత్నూర్ మండల కేంద్రంలో సోమవారం సామాజిక కార్యకర్త పెందుర్ జీవన్ మహారాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ సోయం బాపురావు, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి పనులకు ఆకర్షితుడై పార్టీలో చేరినట్లు జీవన్ మహారాజ్ తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మండల ముఖ్య కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు పెద్ద...