బీఎస్ఎన్ఎల్ టవర్‌లో అగ్నిప్రమాదం
ఏటూరు నాగారం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ టవర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సబ్‌స్టేషన్ పక్కన ఉన్న టవర్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో టవర్‌కు సంబంధించిన పరికరాలు, బ్యాటరీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5 లక్షల నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు.