అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషణ మాస వేడుకలు
మహాదేవపూర్ మండలం మెట్టుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ రాధికా రెడ్డి గారి మరియు సూపర్వైజర్ స్పందన గారి ఆదేశాను ప్రకారం పోషణ మాసం కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్ దీపిక ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోషకాహార పదార్థాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను నిర్వహించి వివిధ రకాల ఆహార పదార్థాల్లో లభించే పోషక విలువలను వివరించారు చిన్నారులకు పోషకాహారం అందించడంతోపాటు వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు గర్భిణీలు బాలింతలు, చిన్నారులకు సమతుల్య ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో మెట్టుపల్లి సర్పంచ్ వెన్నపురెడ్డి సంజీవరెడ్డి ఉపసర్పంచ్ శ్రీరాముల రాజయ్య కార్యదర్శి మంజూర్ ఆశా వర్కర్ తిరుపతమ్మ...