పూలు,ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు*

*పూలు,ఆకుకూరల సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు* గుడిహత్నూర్ భారత వాసి :ఈరోజు గుడిహత్నూర్ మండలంలోని తోషం మరియు మాన్కాపూర్ గ్రామాల్లో పూలు, కూరగాయలు మరియు ఆకుకూరల సాగు ద్వారా రైతులు అధిక ఆదాయం పొందే అవకాశం ఉందని *ఉద్యాన శాఖ విస్తరణ అధికారి ఆడెపు శేఖర్* తెలిపారు. ఈ సందర్భంగా ఎలినీవో ప్రభావం దృష్ట్యా రైతులు పంటల వైవిధ్యాన్ని పాటిస్తూ పూల తోటలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, కొత్తిమీర, మెంతి వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. స్థానిక మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. కూరగాయల పంటలు, బంతి పూల తోటలను సందర్శించి, రైతులకు పంటల...