ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక.. కార్యదర్శిగా సాయికిరణ్
మహాదేవపూర్: ఏబీవీపీ మహాదేవపూర్ నగర నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేట సాయి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి వరంగల్ విభాగ్ సంఘటన మంత్రి పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. నగర కార్యదర్శిగా అడుప సాయికిరణ్‌ను ఎన్నుకున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో వినయ్, సుశాంత్, శ్రీకాంత్, అజయ్, ఆదిత్య, విజయ్, కీర్తన, ఆకాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.