వాకర్స్ అసోసియేషన్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం

హనుమకొండ, అక్టోబర్ 6: పబ్లిక్‌ గార్డెన్‌లోని వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. వాకర్స్‌ ఇంటర్నేషనల్‌-303 ఎంజీఎఫ్‌ గవర్నర్‌, ఇన్‌స్టాలేషన్‌ ఆఫీసర్‌ డా. పుల్లూరి శ్రీనివాస్‌ గౌడ్‌ ముఖ్య అతిథిగా హాజరై నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకర్స్‌ అసోసియేషన్‌ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడంతో పాటు వాకర్స్‌ సంక్షేమానికి మరింత కృషి చేయాలన్నారు. పబ్లిక్‌ గార్డెన్‌లో నడకకు వచ్చే వారికి మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, విశ్రాంతి సౌకర్యాలు కల్పించేందుకు సభ్యులు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. వాకర్స్‌ సంక్షేమంతో పాటు సమాజ ఆరోగ్య పరిరక్షణకు సేవలందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు...