మంటల్లో జీవనాధారం.. బాధితుడికి యూనియన్ ఆర్థిక సాయం

నర్సంపేట, అక్టోబర్ 6: షార్ట్‌సర్క్యూట్‌తో వాటర్ వాషింగ్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుని జీవనాధారం కోల్పోయిన బాధితుడికి నర్సంపేట వాటర్ వాషింగ్‌ యూనియన్ అండగా నిలిచింది. యూనియన్‌ ఆధ్వర్యంలో బాధితుడు శ్రీనుకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. పట్టణంలోని వరంగల్‌ రోడ్డులో గల మీనాక్షి వాటర్ వాషింగ్‌ సెంటర్‌లో అక్టోబర్‌ 4న షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సెంటర్‌లోని పరికరాలు, సామగ్రి, ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.