తెలంగాణ జానపద జీవనానికి సజీవ దర్పణం – బతుకమ్మ
– ప్రిన్సిపాల్ డాక్టర్ జన్ను విజయ్ కుమార్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహాదేవపూర్‌లో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఇ. మాధవి గారి ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జన్ను విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ “బతుకమ్మ తెలంగాణ జానపద జీవనానికి సజీవ దర్పణం. స్త్రీలకు, ప్రకృతికి మధ్య ఉన్న విడదీయరాని అనుబంధానికి బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, స్త్రీల ఐక్యతను చాటుతూ జరుపుకునే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ధర్మం అధర్మంపై, సత్యం...