రూ.50 వేల కోసం హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

భూపాలపల్లి, భారతవాసి: రూ.50 వేల కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి జె. జీవన్ కుమార్ గురువారం తీర్పు వెలువరించారు. మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లి గ్రామానికి చెందిన పెరుగు రమేష్ (26)కు జీవిత ఖైదుతో పాటు రూ.4 వేల జరిమానా విధించారు. మొగుళ్లపల్లి మండలం పెద్దకోమటిపల్లికి చెందిన పెరుగు రమేష్‌కు పర్లపెల్లి గ్రామానికి చెందిన అక్కపెల్లి మల్లయ్యతో పరిచయం ఉంది. 2020 సెప్టెంబర్ 4న ఇద్దరూ ఆకినపల్లిలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకుకు వెళ్లారు. అక్కడ మల్లయ్య తన వ్యక్తిగత అవసరాల కోసం రూ.50 వేలు డ్రా చేసుకున్నాడు. అనంతరం రమేష్‌కు...