అనారోగ్యంతో మృతిచెందిన కుటుంబానికి ఎమ్మార్పీఎస్ ఆర్థిక సాయం

మహాదేవపూర్, భారతవాసి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన సకినారపు లచ్చక్క అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ మహాదేవపూర్ మండల ఇన్‌చార్జి జిల్లెల్ల నాగరాజు మాదిగ గురువారం ఆమె దశదినకర్మకు హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల వంట నూనె అందజేసి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సూరారం గ్రామ శాఖ అధ్యక్షుడు అయిల్ల అశోక్ మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ సీనియర్ నాయకుడు తుడిచెర్ల దుర్గయ్య, మాజీ సర్పంచ్ కొయ్యల మల్లయ్య, పుల్యాల మల్లయ్య,...