విద్య, వైద్య సంస్థల్లో పీఓ ఆకస్మిక తనిఖీలు

విద్య, వైద్య సంస్థల్లో పీఓ ఆకస్మిక తనిఖీలు ఏటూరునాగారం, భారతవాసి: ప్రభుత్వ విద్య, వైద్య సేవలు ప్రజలకు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం మండలంలోని పలు ప్రభుత్వ సంస్థలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆకులవారిఘనపూర్‌ అంగన్వాడీ కేంద్రం, జీపీ పాఠశాలతో పాటు ఏటూరునాగారం సబ్‌సెంటర్‌-1 పల్లె దవాఖాన సబ్‌సెంటర్‌-2లను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారుల హాజరు, రికార్డులు, పోషకాహారం, అభ్యసన సామగ్రి, నిర్వహణ తీరును పరిశీలించారు. చిన్నారులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, బోధనా సామగ్రిని సమర్థంగా వినియోగిస్తూ వారి అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించాలని సిబ్బందికి సూచించారు.పాఠశాలలో తరగతి గదులను పరిశీలించిన పీఓ...