రక్తదానం.. ప్రాణదానంతో సమానం

కన్నాయిగూడెం, భారతవాసి: రక్తదానం ప్రాణదానంతో సమానమని రెడ్‌క్రాస్‌ జిల్లా ప్రతినిధి అబ్బు సతీష్‌ అన్నారు. ములుగు జిల్లా రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ముప్పనపల్లి సహాయ నిధి దాతల సహకారంతో గురువారం కన్నాయిగూడెం రైతువేదికలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 55 యూనిట్ల రక్తాన్ని సేకరించి ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి అందజేశారు. అత్యవసర సమయాల్లో రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. యువతతోపాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసి శిబిరాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జాడి రాంబాబు, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుగ్గుల సమ్మయ్య, వ్యవసాయ శాఖ అధికారి మహేష్‌,...