సీఈసీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా

*సీఈసీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా* ములుగు, భారతవాసి: కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ములుగు జిల్లా కేంద్రంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.దేశంలో ఓట్ల తొలగింపు, ఓట్ల చోరీ జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీలో చేపట్టిన నిరసన సందర్భంగా వారిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ధర్నా నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా...