ఇసుక లారీ బీభత్సం.. సీఆర్పీఎఫ్ జవాన్ దుర్మరణం

ఏటూరునాగారం, భారతవాసి: ములుగు జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాడ్వాయి–పసర మండలాల మధ్య అటవీ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఇసుక లారీ ఎదురుగా వస్తున్న పోలీసు వాహనం, ప్రైవేటు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కరీంనగర్ జిల్లాకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మొగురమ్ రమాకాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు జవాన్లు గిరీష్ కుమార్, ప్రేమ్ ప్రకాష్, రంజానమ్ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు.ఏటూరునాగారం నుంచి ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు పోలీసు వాహనంలో ములుగు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఇసుక లారీ ఢీకొట్టడంతో పోలీసు వాహనం అదుపుతప్పి అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ప్రైవేటు కారు లారీ కిందకు...