గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గంగారం తండా, గట్లకుంట తండాల్లో గురువారం ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. వరంగల్ డిప్యూటీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టారు. దాడుల్లో భాగంగా నాలుగు కేసులు నమోదు చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోవడంతో పాటు, గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన 650 లీటర్ల పులియబెట్టిన పానకాన్ని ధ్వంసం చేశారు. జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాల నియంత్రణకు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు....