బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న అక్కన్నపేట్ మండల అధ్యక్షుడు గుగులోత్ రాజు నాయక్

మోత్కులపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు కేసీఆర్ పాలనలో ఆడపడుచులకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలు.. కాంగ్రెస్ పాలనలో ఆ పథకం ఏమైంది? హుస్నాబాద్ అక్కన్నపేట భారత వాసి (ప్రతినిధి) అక్టోబర్ 18 *బీఆర్ఎస్ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్* అక్కన్నపేట: మండలంలోని మోత్కులపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గుగులోతు రాజు నాయక్ ముఖ్య అతిథిగా హాజరై, గ్రామ మహిళలు, ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు....