ఇంద్రవెల్లి కుంరం భీం కాంస్య విగ్రహ ఆవిష్కరణ - ఉమ్రి( బి) రాయి సెంటర్ లో గోడపత్రాల ఆవిష్కరణ
గుడిహత్నూర్ భారత వాసి: ఇంద్రవెల్లి సార్ మేడి మరియు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలను ఉమ్రి-బి రాయి సెంటర్ కార్యాలయంలో ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉమ్రి రాయి సెంటర్ సార్ మేడి గారికి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేస్లాపూర్ సార్ మేడి మేస్రం వేంకట్ రావు, రాజ్ గోండ్ ఉద్యోగుల సంఘం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మేస్రం శేఖర్ బాబు గిన్నెర సార్ మేడి మేస్రం దుర్గు, గిన్నెర...