వరి పంటను పరిశీనించిన డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి.
కొడిమ్యాల మండలంలో కత్తెర పురుగు ప్రభావంతో వరి పంట రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటకు పురుగు సోకడంతో దిగుబడి తగ్గింది.విషయం తెలుసుకున్న వన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి శనివారం రోజున పంట నష్టపోయిన పొలాలను పరిశీలించి రైతులను పరామర్శించారు. అనంతరం రైతులతో కలిసి వ్యవసాయ విస్తరణాధికారిని పి.జ్యోతికి వినతిపత్రం సమర్పించారు. పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు. ఇట్టి సందర్భంగా డాక్టర్ మర్రి మహేష్ రెడ్డి మాట్లాడుతూ కత్తెర పురుగు ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. పురుగు నివారణకు...