భార్యను హత్య చేసి పరారైన భర్త

వరంగల్:వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం గడ్డపార తండా శివారు హర్జ తండాలో పాత్త్య పూలమ్మ దారుణ హత్య.అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో భార్యను భర్త పాత్త్య బాలు ఉరివేసి హత్య చేసి పరారైనట్లు కుమార్తెలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో తండాలో విషాదం నెలకొంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న భర్త ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.