ప్రవేట్ పాఠశాలలో నిలువు దోపిడి పై కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన జనసేన పార్టీ వీర నాయకురాలు రాగుల శిరీష
స్కాలర్షిప్ టెస్టుల పేరుతో విద్యార్థులను మోసం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు వినతి **జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన జనసేన వీర మహిళా నాయకురాలు రాగుల శిరీష కరీంనగర్: విద్యా సంవత్సరం ముగియకముందే స్కాలర్షిప్ టెస్టుల పేరుతో ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తున్న ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ వీర మహిళా నాయకురాలు రాగుల శిరీష డిమాండ్ చేశారు. ఈ మేరకు జనసేన వీర మహిళా నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాగుల శిరీష మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ...