కుంరం భీం స్ఫూర్తితో రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు ఉద్యమిస్తాం - ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి
కుంరం భీం స్ఫూర్తితో రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు ఉద్యమిస్తాం - ఆదివాసీ సేన రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి గుడిహత్నూర్ భారత వాసి:, విప్లవ వీరుడు కుంరం భీం స్ఫూర్తితో ఆదివాసీల రాజ్యాంగపరమైన హక్కుల సాధనకు నిరంతరం ఉద్యమిస్తామని ఆదివాసీ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి అన్నారు. అమరవీరుడు కుంరం భీం 86వ వర్ధంతి సందర్భంగా సోమవారం గుడిహత్నూర్ మండలంలో ఘనంగా నివాళులర్పించారు. గోండ్వానా రాయి సెంటర్ ఆధ్వర్యంలో మండలంలోని మాన్కాపూర్ రాయి సెంటర్ నుండి గుడిహత్నూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం డోలు, పెప్రే, సన్నాయి వాయిస్తూ ఆదివాసీ యువత...