చెల్పూర్‌లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి
చెల్పూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెల్పూర్ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.7,690 నగదు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఏడుగురిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం ఘణపురం పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు. ఈ వ్యవహారంలో మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.