వరి పంటలో కట్వార్మ (రెల్ల రాలు పురుగు) నివారణ సూచనలు. కొడిమ్యాల, అక్టోబర్ 27: (భారత వాసి ప్రతినిధి).
కొడిమ్యాల మండలంలో మండల వ్యవసాయాదికారిణి పి జ్యోతి వరి పంట కోత దశలో కాడ తొలుచు పురుగులను పంట పొలాల్లో పరిశీలించారు. వరి పంట కోత దశలో ఆశించే కట్వార్మ (రెల్ల రాలు పురుగు) పురుగును సాధారణంగా ఆర్మీవార్మ్ / కట్ వార్మ్ అని పిలుస్తారు. ఇవి రాత్రి వేళల్లో పైకి పాకి, గింజలతో నిండిన వరి కంకులను మొదలు వద్ద కత్తిరిస్తాయి. దీనివల్ల కంకులు నేలరాలి కోతకు వచ్చే సమయంలో తీవ్ర దిగుబడి నష్టం జరుగుతుందని తెలిపారు. పురుగుల మందులను నేరుగా గింజలు లేదా కంకుల పై పిచికారీ చేయకూడదన్నారు. కట్వార్మ (రెల్ల రాలు పురుగు) పురుగులు పగటిపూట సూర్యరశ్మికి భయపడి వరి పిలకల...