Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Author Eravelli Harshini | 20 Oct 2026, 07:53 PM | TELANGANA
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం కామనపల్లి గ్రామానికి చెందిన వాసం శ్రీనివాస్ అనే వ్యక్తి మహాదేవపూర్ మండలం అంబటిపల్లికి వెళ్లి తన పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా పెద్దంపేట గ్రామ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా శ్రీనివాస్ అప్పటికే మృతి చెంది ఉన్నాడు. దీంతో స్థానికులు 108 అత్యవసర వాహనానికి సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం 108 వాహనంలో మహాదేవపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పండుగ వేళ ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో కామనపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.