Monday, April 13, 2026
More
    HomeUncategorizedమహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

    మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

    మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం


    జయశంకర్ భూపాలపల్లి,భారతవాసి ప్రతినిధి:
    మహిళలకు స్వయం ఉపాధి కలిగించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని గ్రంథాలయ చైర్మన్ కోటా రాజబాబు అన్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పలుగులలో శుక్రవారం మహిళల స్వయం ఉపాధికి ప్రోత్సాహం కల్పించే దిశగా కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా 15 రోజులపాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు.
    పలుగుల గ్రామపంచాయతీలో ప్రారంభమైన ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం మహిళలకు ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు దోహదపడనుంది. ALEAP సంస్థ నిర్వహణలో, MSME ఆధ్వర్యంలో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ శిక్షణ ద్వారా మహిళలు కుట్టు నైపుణ్యాలను అభ్యసించి స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని అన్నారు.
    ఈ శిక్షణతో మహిళలు చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించగలరు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలతో మహిళలను ప్రోత్సహిస్తోంది.
    ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు గ్రామీణ మహిళలకు ఆదాయ వనరులు కల్పించి, కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, ఎంపీడీవో రవీంద్రనాథ్,ఏపీవో, సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్లు,కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

    Spread the love
    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments