Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

వినాయక నిమజ్జనానికి చెరువుల పరిశీలన

Author Pulluri srinivas | 07 Sep 2026, 04:43 PM | TELANGANA
వినాయక నిమజ్జనానికి చెరువుల పరిశీలన

నర్సంపేట, సెప్టెంబర్ 7:
వినాయక నవరాత్రి ఉత్సవాలు నేపథ్యంలో గణనాథుల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నర్సంపేట మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దామర చెరువు, మాదన్నపేట చెరువులను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పరిశీలించారు.
మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, టౌన్ సీఐ ముస్క శ్రీనివాస్‌లతో కలిసి చెరువులను పరిశీలించిన చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి .రామనంద్. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో దామర చెరువులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. దీంతో గణనాథుల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలిపారు.
నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మాదన్నపేట చెరువులోని అనువైన ప్రాంతాన్ని పరిశీలించినట్లు చెప్పారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసుల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని వినాయక నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులకు చైర్ పర్సన్ శ్రీ లక్ష్మీ రామానంద్ సూచించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ చంద్రమౌళి, కౌన్సిలర్లు కొత్తకొండ మేఘన-శ్యాంరాజ్, ముత్తినేని వెంకన్న, బీరం భరత్‌రెడ్డి, ఏపూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎలకంటి విజయ్‌కుమార్, సలావుద్దీన్ ఆయూబ్ ఖాన్, పొన్నాల మనీషా-ప్రకాష్, శ్రీరామోజు రోజారాణి, ఇస్లావత్ రామాగోపి నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, 9వ వార్డు అధ్యక్షులు మేరుగు కిరణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు గోపు మహేందర్‌రెడ్డి, భూక్య గణేష్, ఉప్పుల షాలోమ్, చీకటి శివమణి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.