Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి భూపాలపల్లి ఆర్డీవో హరికృష్ణ

Author BHARATHA VAASI | 13 Sep 2026, 02:09 PM | TELANGANA
ఎస్ఐఆర్ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలి భూపాలపల్లి ఆర్డీవో హరికృష్ణ

ఎస్ఐఆర్ స్పెషల్ క్యాంపెయిన్ డేస్‌లో భాగంగా శని, ఆదివారాల్లో కొనసాగుతున్న నోటీసుల పంపిణీ ప్రక్రియను భూపాలపల్లి ఆర్డీవో హరికృష్ణ, తహశీల్దార్ లక్ష్మీ రాజయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

భూపాలపల్లి పట్టణంలోని కృష్ణ కాలనీ, కార్ల్ మార్క్స్ కాలనీ, సీఆర్ నగర్, సుభాష్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు ఓటర్లకు నోటీసుల పంపిణీ తీరును పరిశీలించారు.నోటీసులు అందుకున్న ఓటర్లు సంబంధిత ధృవపత్రాలను బిఎల్ఓ లకు అందజేయాలని సూచించారు.అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు..
ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి నోటీసులు అందించాలని, మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ధృవపత్రాలను సేకరించి, ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిపిఓ లు కిరణ్, జితేందర్, అనిల్ కుమార్‌తో పాటు సంబంధిత బిఎల్ఓ లు పాల్గొన్నారు.