Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తిరుమల పర్యటన: శ్రీవారిని దర్శించుకున్న కుటుంబ సభ్యులు

Author Pulluri srinivas | 14 Sep 2026, 11:17 AM | TELANGANA
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తిరుమల పర్యటన: శ్రీవారిని దర్శించుకున్న కుటుంబ సభ్యులు

నర్సంపేట వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.దర్శనానంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... వినాయక చవితి శుభసందర్భంగా కలియుగ వైకుంఠనాథుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరిపై శ్రీవారి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరి ఇంటా శాంతి సౌభాగ్యాలు విరజిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.