Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణలో సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

Author Pulluri srinivas | 15 Sep 2026, 01:41 PM | TELANGANA
తెలంగాణలో సెప్టెంబర్‌ 17ను విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి. బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ

నర్సంపేట :మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల తరహాలో తెలంగాణలోనూ సెప్టెంబర్‌ 17ను అధికారికంగా **‘తెలంగాణ విమోచన దినోత్సవం’**గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాణి రుద్రమ మాండ్ చేసింది.
అదేవిధంగా రాష్ట్రంలో బకాయి ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వెంటనే విడుదల చేసి కళాశాల యాజమాన్యాలకు చెల్లించాలని, తద్వారా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని,
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన మహిళలందరికీ ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం వెంటనే జమ చేయాలని కోరింది. అలాగే రైతులు, పేదల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేసే విధానాన్ని నిలిపివేసి, 22ఏ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్‌ చేసింది.
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తక్షణమే పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీజేపీ స్పష్టం చేసింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే, బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేపట్టడం తప్పదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికారపాదంభారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికారపాదం ప్రతినిధి రాణి రుద్రమ హెచ్చరించింది.