Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నర్సంపేట మిని స్టేడియానికి గడ్డి కోత పరికరం వితరణ

Author Pulluri srinivas | 15 Sep 2026, 02:36 PM | TELANGANA
నర్సంపేట మిని స్టేడియానికి గడ్డి కోత పరికరం వితరణ

నర్సంపేట: క్రీడాకారులు, వాకర్స్ సౌకర్యార్థం నర్సంపేట మిని స్టేడియానికి గోక లీలావతి ట్రస్ట్ రూ.12 వేల విలువైన గడ్డి కోత పరికరాన్ని విరాళంగా అందించింది. వరంగల్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థన మేరకు ట్రస్ట్ వ్యవస్థాపకులు గోక రామస్వామి, వారి కుమారులు గోక వినోద్, గోక నాగరాజులు ఈ పరికరాన్ని అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్టేడియంలో పెరిగిన గడ్డి వల్ల క్రీడాకారులకు, వాకర్స్‌కు ఇబ్బందిగా మారిన విషయాన్ని గుర్తించి, ట్రస్ట్‌ను సంప్రదించగా వారు సానుకూలంగా స్పందించి ఈ సాయం చేశారని తెలిపారు. నర్సంపేట ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి తోడ్పడిన గోక రామస్వామి కుటుంబానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్టేడియం ఇన్‌చార్జ్ యాట రవికుమార్ ముదిరాజ్, వ్యాయామ ఉపాధ్యాయులు గూడెపు బిక్షపతి, ఈసాల లక్ష్మయ్య, వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆడెపు సదానందం, సభ్యులు డేవిడ్, దేవేందర్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.