Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

Author As | 20 Sep 2026, 10:28 AM |
 కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి

మల్హర్‌: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని ఎంసీపీఐ(సీ) జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి అక్కల బాపు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.సింగరేణిలో వేలాది మంది కాంట్రాక్ట్‌ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనాల విషయంలో అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. శాశ్వత కార్మికులతో సమానంగా పనులు చేయిస్తూ తక్కువ వేతనాలు చెల్లించడం సరికాదన్నారు. కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, బోనస్‌, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.పెండింగ్‌ వేతన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వేతనాల కోసం ప్రశ్నించే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. కాంట్రాక్ట్‌ వ్యవస్థను రద్దు చేసి అర్హులైన కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే కార్మిక సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బాపు యాదవ్‌ హెచ్చరించారు.