Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గణేష్ ఉత్సవాల్లో మతసామరస్యానికి ప్రతీకగా మహా అన్నదానం

Author syed Abzal pasha | 20 Sep 2026, 09:36 PM | Array
గణేష్ ఉత్సవాల్లో మతసామరస్యానికి ప్రతీకగా మహా అన్నదానం

ఏటూరునాగారం: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏటూరునాగారం మండల కేంద్రంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. స్థానిక ముస్లిం సోదరులు అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి పాల్గొనడం ద్వారా సోదరభావాన్ని చాటిచెప్పారు.ఈ సందర్భంగా జామా మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అబ్జల్ పాషాను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు కిశోర్ కుమార్, రంజిత్, చిన్ని కృష్ణ, శ్రీను, కందకట్ల శ్రీను, ప్రసాద్, కళ్యాణ్, అన్వర్, అలీ, అఫ్రిది, బాబా, చోటు, మహేమూద్, సోనూ, అఫ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.