Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కుక్కను తప్పించబోయి బోల్తాపడ్డ స్కూల్‌ ఆటో

Author syed Abzal pasha | 21 Sep 2026, 08:04 PM | TELANGANA
కుక్కను తప్పించబోయి బోల్తాపడ్డ స్కూల్‌ ఆటో

వెంకటాపురం: రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో స్కూల్‌ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తాపడిన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో వెంకటాపురం జడ్పీహెచ్‌ఎస్‌ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన విద్యార్థులను వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల్లో ఒకరికి మెరుగైన వైద్యం అవసరం కావడంతో ములుగు ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. మిగతా విద్యార్థులు వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.గాయపడిన విద్యార్థులు వీరభద్రవరం గ్రామానికి చెందినవారిగా సమాచారం. స్కూల్‌ విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.