Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజలు

Author Eravelli Harshini | 22 Sep 2026, 03:51 PM | TELANGANA
గణేష్ మండలి ఆధ్వర్యంలో ఘనంగా కుంకుమ పూజలు

మెట్ పల్లి: మహాదేవపూర్ మండలం మెట్ పల్లి లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం 8వ రోజు కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెట్ పల్లి గణేష్ మండలి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు చేశారు.అనంతరం భక్తులు, గ్రామస్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వెన్నపురెడ్డి సంజీవరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీరాముల రాజయ్య, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గణేష్ మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.